ఢిల్లీలో మొదటిసారిగా జాతీయ అంతరిక్ష దినోత్సవం

ఢిల్లీలో మొదటిసారిగా జాతీయ అంతరిక్ష దినోత్సవం

నేషనల్ ఫస్ట్ స్పేస్ డే సందర్భంగా ఢిల్లీ భారత మండపంలో నిర్వహించిన ఎగ్జిబిషన్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. ఇస్రో రోబోటిక్స్ చాలెంజ్, భారతీయ అంతరిక్ష హ్యాకథాన్ విజేతలకు ఆమె బహుమతులు అందజేశారు. గతేడాది (2023 ఆగస్ట్ 23) ఇదే రోజు చంద్రయాన్ -3ని విజయవంతంగా ప్రయోగించామన్నారు ఇస్రో చైర్మన్ సోమనాథ్.  ఆ తర్వాత కొన్ని రోజలకు ప్రధాని మోదీ ఇస్రోను సందర్శించి ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన పలు ప్రయోగాలు ఈ కార్యక్రమంలో ఆకట్టుకున్నాయి.