
హామిల్టన్ లోని సిడాన్ పార్క్ లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ జట్టు పై న్యూజిలాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 348 పరుగుల భారీ టార్గెట్ ను న్యూజిలాండ్ 11 బంతులు మిగిలుండగానే టార్గెట్ ను పూర్తి చేసింది.
ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. భారత్ జట్టు బ్యాట్స్ మెన్లు శ్రేయస్ అయ్యర్ 103, కేఎల్ రాహుల్ 88, విరాట్ కోహ్లీ 51, మయాంక్ అగర్వాల్ 32 పరుగులు చేశారు.
తర్వాత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టు 48.1 ఓవర్లలోనే 348 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు రాజ్ టేలర్ 109 పరుగులతో నాటౌట్ గా నిలవగా, హెన్రీ నికోలస్ 78, టామ్ లాథమ్ 69, మార్టిన్ గఫ్తిల్ 32 పరుగులు చేశారు.
భారత్ బౌలర్లు కుల్దీప్ యాదవ్ రెండు, శార్దూల్ ఠాకూర్ ఒకటి, మహమ్మద్ షమీ ఒకటి చొప్పున వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ విజయంతో కివీస్ మూడు వన్డేల సిరీస్1-0 తో ఆధిక్యంలో నిలిచింది. రెండు జట్ల మధ్య రెండో వన్డే ఫిబ్రవరి 8న ఆక్లాండ్ లో జరగనుంది.