పంచాయతీ ఎన్నికలలో భాగంగా తొలి విడత పోలింగ్ గురువారం (డిసెంబర్ 11) ప్రశాంతంగా ముగిసింది. తొలి విడతలో 3,834 సర్పంచ్, 27,628 వార్డ్ మెంబర్ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాధారణ ఎన్నికలతో పోల్చితే సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్ల నుంచి భారీ స్పందన వచ్చింది. ఒక్కో జిల్లాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ సమయం ముగిసినా.. ఓటర్లు లైన్లలో ఉండటంతో క్యూలైన్లలో ఉన్న వారికి ఓటేసేందుకు అనుమతించారు ఎన్నికల అధికారులు. .
జిల్లాల వారీగా పోలింగ్ శాతం:
- సంగారెడ్డి జిల్లాలో 84.7 శాతం పోలింగ్ నమోదు
- మెదక్ జిల్లాలో 85.9 శాతం పోలింగ్ నమోదు
- సిద్దిపేట జిల్లాలో 80.1 శాతం పోలింగ్ నమోదు
- వరంగల్ జిల్లాలో 81.2 శాతం పోలింగ్ నమోదు
- ములుగు జిల్లాలో 73.57 శాతం పోలింగ్ జరిగింది.
- హనుమకొండ జిల్లాలో 81.39 శాతం పోలింగ్ నమోదు
- జనగామ జిల్లాలో 78.57 శాతం పోలింగ్
- భూపాలపల్లి జిల్లాలో 82.26 శాతం పోలింగ్ నమోదు
- కరీంగనర్ జిల్లాలో 81.42 శాతం పోలింగ్ నమోదు
- నిజామాబాద్ జిల్లాలో 80.50 శాతం పోలింగ్ నమోదు
- సూర్యాపేట జిల్లాలో 87.77 శాతం పోలింగ్ నమోదు
- మహబూబ్ నగర్ జిల్లాలో 83 శాతం పోలింగ్ నమోదు
- నారాయణపేట జిల్లాలో 81.71 శాతం పోలింగ్ నమోదు
- నాగర్ కర్నూల్ జిల్లాలో 82.73 శాతం పోలింగ్ నమోదు
- జోగులాంబ గద్వాల జిల్లాలో 86.55 శాతం పోలింగ్ నమోదు
- వనపర్తి జిల్లాలో 81.67 శాతం పోలింగ్ నమోదు
- కుమ్రంబీమ్ జిల్లాలో 77.07 శాతం పోలింగ్ నమోదు

