
డార్లింగ్ కృష్ణ, మనీషా జంటగా శశాంక్ దర్శకత్వంలో మంజునాథ్ కందుకూరు నిర్మిస్తున్న చిత్రం ‘బ్రాట్’. శనివారం ఈ మూవీ మొదటి పాటను విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ‘యుద్ధమే రాని’ సాంగ్‌ను నరేష్ లాంచ్ చేశారు. అర్జున్ జన్య సంగీతం అందించిన ఈ పాటకు సనారె లిరిక్స్ రాశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో వీకే నరేష్ మాట్లాడుతూ ‘మంజునాథ్ నాకు మంచి స్నేహితుడు. ఆడియన్స్ పల్స్ తెలిసిన ప్రొడ్యూసర్. నాతో కన్నడలో ఓ సినిమా చేశారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో వస్తున్నారు.
ఐదు భాషల్లో చిత్రీకరించి విడుదల చేస్తున్నారు. తెలుగులో పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. టీజర్ చూశాను. చాలా ప్రామిసింగ్‌గా ఉంది. యూత్‌కి పర్ఫెక్ట్ ఫిలిం ఇది’ అని చెప్పారు. ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని హీరో డార్లింగ్ కృష్ణ, హీరోయిన్ మనీషా అన్నారు.
డైరెక్టర్ శశాంక్ మాట్లాడుతూ ‘అందరికీ రిలేట్ అయ్యే కథ ఇది. ‘యుద్ధమే రాని’ పాటను కన్నడ, తెలుగు రెండు భాషల్లో కూడా సిద్ శ్రీరామ్ పాడారు. అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా’ అని అన్నాడు. తెలుగు ఆడియెన్స్ ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుతున్నా అని నిర్మాత మంజునాథ్ అన్నారు.