ఆర్యన్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. సంగీత ప్రియులకు ఆకట్టుకుంటున్న లిరిక్స్

ఆర్యన్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. సంగీత ప్రియులకు ఆకట్టుకుంటున్న లిరిక్స్

విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్​జంటగా కె ప్రవీణ్ రూపొందించిన  ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. శుభ్ర, ఆర్యన్ రమేష్, విష్ణు విశాల్ కలిసి నిర్మించారు. అక్టోబర్ 31న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం ‘ఐయాద్ ది గయ్’ అంటూ సాగే  ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. జిబ్రాన్ సాంగ్ కంపోజ్ చేయడంతోపాటు శ్రీకాంత్ హరిహరన్‌‌‌‌‌‌‌‌తో కలిసి పాడిన తీరు ఆకట్టుకుంది.

 సామ్రాట్ లిరిక్స్ అందించాడు. ‘తెల్లారే చీకటవ్వగానే.. చల్లారే వేడిగుండగానే.. అన్నారే అర్ధమవనట్టు ఎన్నో మాటలే.. ఇన్నాళ్లూ లేదే వెలుతురు.. మావాళ్లు ఏంటని అడగరు.. పెద్దోళ్లు పెద్ద ముదుర్లు అంటే చెప్పరే..’ అంటూ  సాగిన పాటలో హీరో హీరోయిన్ మధ్య బాండింగ్‌‌‌‌‌‌‌‌ను చూపించారు. విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది.

ఇందులో విష్ణు విశాల్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. సెల్వరాఘవన్, మానస చౌదరి, సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ ఇతర పాత్రల్లో నటించారు.  హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్,  తెలంగాణలో శ్రేష్ట్ మూవీస్ ద్వారా విడుదల చేయనున్నారు.