
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 1న ‘గణేష్’ సాంగ్ విడుదల కాబోతోందని చెప్పారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో బాలకృష్ణ డ్రమ్స్ కొడుతూ మాస్ లుక్‌లో కనిపించారు.
అఖండ, వీరసింహారెడ్డి చిత్రాల తర్వాత మరోసారి బాలకృష్ణ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలకపాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 19న సినిమా విడుదల కానుంది.