చాయ్ వాలా మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

చాయ్ వాలా మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

శివ కందుకూరి, తేజు అశ్విని జంటగా ప్రమోద్ హర్ష దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘చాయ్ వాలా’. ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌కు పాజిటివ్‌‌ రెస్పాన్స్‌‌ రాగా, గురువారం తొలిపాటను విడుదల చేశారు. ‘సఖిరే.. నువ్వుంటే చాలులే.. సఖిరే.. నీ వెంటే నీనులే..’ అనే పల్లవితో సాగే ఈ పాట కోసం ప్రశాంత్ ఆర్‌‌‌‌ విహారీ మెలోడీయస్‌‌ ట్యూన్‌‌ కంపోజ్ చేశారు. 

‘‘ఉరికే ఉరికే నీ వెనకాలే వస్తానంటూ మనసాగనంటూ ఉరికే.. దొరికే దొరికే ఏ  కలలోన ఏనాడైనా అనుకోని హాయి దొరికే.. చాటుగా నిన్నేచూస్తూ మురిసా మురిసా.. అలవాటుగా నీ ఊహల్లో తడిశా తడిశా..’ అంటూ సురేష్ బనిశెట్టి క్యాచీగా రాసిన లిరిక్స్‌‌ ఇంప్రెస్‌‌ చేశాయి. హీరో తన మనసులోని ప్రేమను తెలియజేస్తున్నట్టుగా సాగిన ఈ పాటను కపిల్‌‌  కపిలన్‌‌ పాడాడు. 

పాటలో శివ కందుకూరి, తేజు అశ్విని ఆన్‌‌ స్క్రీన్‌‌ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.