
ప్రదీప్ రంగనాథన్, మమిత బైజూ జంటగా కీర్తిశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘డ్యూడ్’. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సేనాపతి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్ అందించగా, సాయి అభ్యాంకర్ కంపోజ్ చేయడంతోపాటు దీప్తి సురేష్, భూమితో కలిసి పాడాడు. ‘బూమ్ బూమ్’ అంటూ సాగే టైటిల్ సాంగ్ కాలేజ్ స్టూడెంట్స్ వ్యక్తిత్వాలను తెలియజేసేలా ఉంది.
ఈ పాటను హీరో హీరోయిన్‌తో పాటు నలభై మంది యువతపై చిత్రీకరించారు. సరదాగా గడిపే ఫ్రెండ్స్ గ్యాంగ్, ప్రదీప్, మమిత కెమిస్ట్రీ, స్టైలిష్ డ్యాన్స్ మూవ్‌లతో సాంగ్ ట్రెండీగా ఉంది. ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల కానుంది.