
- రిజిస్ట్రేషన్లతో సర్కార్కు ఫుల్ ఇన్కమ్
హైదరాబాద్, వెలుగు: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు కొత్త ఏడాది కలిసి వచ్చింది. మొదటి నెలలోనే శాఖ ఆదాయంలో ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైమ్ ఒక నెలలోనే రూ.850 కోట్ల ఇన్కమ్ ఖజానాకు చేర్చింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ స్థాయిలో ఆదాయం రావడం ఇదే తొలిసారి అని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వెల్లడించారు. కొత్త ఏడాది ప్రారంభమయ్యాక జనవరి నెలలో 1,47,398 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా రూ.800 కోట్ల ఆదాయం వచ్చింది.
స్టాంప్స్ అమ్మకాల ద్వారా మరో రూ.50 కోట్లకుపైగా ఇన్కమ్ జమైంది. 2020లో లాక్ డౌన్, ఆర్థిక వ్యవస్థ కుదేలైన కారణంగా రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా తగ్గింది. దీనికి తోడు కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆదాయం భారీగా పడిపోయింది. మిగతా నెలల్లో ఎల్ఆర్ఎస్ రూల్స్ ఈ శాఖ రాబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. డిసెంబర్ లో రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అయిన తర్వాత నాన్ అగ్రికల్చర్ ధరణి పోర్టల్ లో తలెత్తిన సాంకేతిక సమస్యలు, హైకోర్టు అక్షింతలతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ప్రభుత్వం యూటర్న్ తీసుకుని పాత పద్ధతిలోనే ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను కూడా డిసెంబర్ 29 నుంచి రిజిస్ట్రేషన్ చేయడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. అప్పటి వరకు కళ తప్పిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సందడి నెలకొంది.
For More News..
ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు పెంచిన బోర్డు
కరోనాతో మరణించిన డాక్టర్ భార్యకు ఉద్యోగం
దవాఖాన్లకే మస్తు పైసల్.. 18 వేల జీతంలో 4 వేలు ఆస్పత్రికే