కృష్ణా -కాచిగూడ రైల్వే స్టేషన్ మధ్య మొదటి రైలు.. అక్టోబర్ 1న వర్చువల్గా ప్రారంభం

కృష్ణా -కాచిగూడ రైల్వే స్టేషన్ మధ్య మొదటి రైలు.. అక్టోబర్ 1న వర్చువల్గా ప్రారంభం

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : కృష్ణా–కాచిగూడ మధ్య మొదటి రైలు సేవలను (డెమో) ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అలాగే జక్లేర్–కృష్ణా మధ్య కొత్త రైలు మార్గాన్ని కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. కాచిగూడ-–రాయచూర్–-కాచిగూడ స్టేషన్ల మధ్య దేవరకద్ర, కృష్ణా మీదుగా నూతన రైలు సర్వీస్ (డెమో)ను నడపనున్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట, రాయచూర్  జిల్లాలను కలుపుతూ ఈ రైలు నడుస్తుంది. దీంతో కాచిగూడ, రాయచూరు మధ్య దూరం తగ్గనుంది. అలాగే మహబూబ్ నగర్, నారాయణపేట వాసులు హైదరాబాద్ కు వెళ్లడానికి కూడా మరింత సులభం కానుంది.