ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ట్రాన్స్‌జెండర్ అనన్య ఆత్మహత్య

V6 Velugu Posted on Jul 21, 2021

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మొట్టమొదటి ట్రాన్ప్ జెండర్ ఉమెన్, ఆర్‌జే అనన్య కుమారి ఆత్మహత్య చేసుకుంది. కొచ్చిలోని తన అపార్ట్‌మెంట్‌లో నిన్న(మంగళవారం) ఉరి వేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గతేడాది సర్జరీ చేయించుకున్నప్పటి నుంచి ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత పూర్తి విషయాలు తెలుస్తాయన్నారు. అనన్య ఈ ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేశారు.

2020లో అనన్య కుమారి కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో వెజినోప్లాస్టీ సర్జరీ చేయించుకున్నారు. ఈ క్రమంలో ఏడాది తర్వాత కూడా ఆమె అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ వచ్చారు. కాగా అనుమానాస్పద స్థితిలో లభ్యమైన అనన్య మృతదేహాన్ని అధికారులు ఎర్నాకులం జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనన్య తాను ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tagged suicide, First Transgender, File Nomination, Kerala Polls

Latest Videos

Subscribe Now

More News