అవడికి తొలి మహిళా ట్రాఫిక్​ ఇన్ స్పెక్టర్​

అవడికి తొలి మహిళా ట్రాఫిక్​ ఇన్ స్పెక్టర్​

చెన్నై మెట్రోపాలిటన్​లోని అవడి మున్సిపాలిటీలో ఓ మహిళ తొలిసారి ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్​గా విధులు నిర్వహించనున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అంబత్తూరు  స్టేట్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరోలో  సుజిత(34) అనే మహిళ సబ్​ ఇన్స్​పెక్టర్​గా పని చేశారు. ఈ క్రమంలో అవడి పోలీస్​ కమిషనర్​ ఏ అరుణ్​ ఆమెకు కొత్త బాధ్యతలు అప్పగించారు. అదే ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్​గా విధులు నిర్వహించడం.  తనకు అప్పగించిన ఈ బాధ్యతల గురించి సుజిత మాట్లాడుతూ.. 

రహదారి మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, ట్రాఫిక్​ నిబంధనలు కఠినంగా అమలు చేయడం తన ప్రాధాన్యత క్రమంలో ఉన్న కొన్ని అంశాలని ఆమె చెప్పారు. రోడ్లపై ట్రాఫిక్​ రద్దీని నియంత్రించడం, హెల్మెట్​ల ప్రాధాన్యత ను ప్రజలకు వివరించడం, సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం తదితర సవాళ్లు తనకు ఎదురు కాబోతున్నట్లు తెలిపారు.  జంక్షన్​లలో నిలబడ్డప్పుడు ఎదురయ్యే కాలుష్యం, దుమ్ము తదితర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. చెన్నై తిరువళ్లూరు రోడ్డు అత్యంత సవాలుతో కూడుకున్నదన్నారు.