చెన్నూరు, వెలుగు: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి జి.వివేక్వెంకటస్వామి ఆదేశాల మేరకు కాంగ్రెస్నాయకులు శుక్రవారం చెన్నూరు మండలంలోని15 గ్రామాల చెరువుల్లోకి చేప పిల్లలను వదిలారు. మొత్తం 9.75 లక్షల చేప పిల్లలు వదిలినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు.
