మనిషి ముఖాన్ని పోలిన చేప.. వీడియో చూస్తేనే విరక్తి..

మనిషి ముఖాన్ని పోలిన చేప.. వీడియో చూస్తేనే విరక్తి..

చాలా మంది చేపల కూరను ఎంతో ఇష్టంగా తింటారు. అటువంటి వారు ఈ చేపను చూస్తే మళ్లీ వాటి జోలికి వెళ్లరు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ చేపను చూసి ఎవరైనా దీన్ని ధైర్యంగా తినగలరా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మనిషి ముఖాన్ని పోలిన ఈ చేపను తినాలంటేనే విరక్తి కలుగుతుందని దీన్ని చూసిన వారు అభిప్రాయపడుతున్నారు.

చైనాలోని మియావో గ్రామంలో ఓ మహిళ సందర్శించినప్పుడు అక్కడి చెరువులో ఈ చేపను చూసి వీడియో తీసిందట. ఆ వీడియోను సదరు మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.