జూన్ ​8, 9న హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీ

జూన్ ​8, 9న హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీ
  • నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​లో ఏర్పాట్లు

బషీర్​బాగ్, వెలుగు: వచ్చే నెల 8, 9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరగనున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. మృగశిర కార్తెను పురస్కరించుకొని బత్తిని కుటుంబసభ్యులు పంపిణీ చేసే చేప ప్రసాదం కార్యక్రమంపై సోమవారం బేగంబజార్ పోలీసులు సన్నాహక సమావేశం నిర్వహించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​లో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీపీ శిల్పవల్లితోపాటు 21 విభాగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

జూన్ 8 , 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని, అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు డీసీపీ సూచించారు. శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. గతేడాది లోపాలను సమీక్షించారు. చేప ప్రసాదం కోసం వచ్చే ఆస్తమా పేషెంట్లకు అన్ని ఏర్పాట్లు చేయాలని.. సజావుగా పంపిణీ చేయడానికి అన్ని విభాగాలు సమన్వయంతో కృషి చేయాలని డీసీపీ కోరారు.