75 ఏళ్ల వయసులో పదవీ వ్యామోహమెందుకు?... జీవన్ రెడ్డి పై ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి ఫైర్

75 ఏళ్ల వయసులో పదవీ వ్యామోహమెందుకు?... జీవన్ రెడ్డి పై ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి ఫైర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​పార్టీ మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఎంతో చేసిందని, 40 ఏళ్లు ఆదరించిన కన్నతల్లి లాంటి పార్టీనే విమర్శిస్తున్నారని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఫైర్ అయ్యారు. గురువారం గాంధీ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. 75 ఏళ్ల వయసులో ఆయనకు పదవిపై వ్యామోహమెందుకని ప్రశ్నించారు. 

ఎమ్మెల్యేగా ఓడిపోయినా పార్టీ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చిందని, కాంగ్రెస్ కోసం పదేళ్లుగా పనిచేసిన ఎందరో నాయకులకు ఇప్పటికీ పదవులు రాలేదన్నారు. వారంతా ఓపికతో పార్టీ కోసం పనిచేస్తున్న విషయం జీవన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. ఈ వయసులో యువ కార్యకర్తలకు జీవన్ రెడ్డి ఆదర్శంగా ఉండాల్సిందిపోయి, పదవుల కోసం పార్టీని వీడడం దురదృష్టకరమని విమర్శించారు.