చెరువుల పండుగను బహిష్కరిస్తున్నం: మత్స్యకార సంఘం

చెరువుల పండుగను  బహిష్కరిస్తున్నం: మత్స్యకార సంఘం

జగిత్యాల రూరల్, వెలుగు: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 8న నిర్వహించనున్న చెరువుల పండుగను బహిష్కరిస్తున్నామని జగిత్యాల రూరల్​మండలం లక్ష్మీపూర్ గ్రామ మత్స్యకార సంఘం సభ్యులు తీర్మానించారు. బుధవారం గ్రామంలోని గంగమ్మ ఆలయం ఎదుట గంగపుత్రులు నిరసన తెలిపారు.

సొసైటీ అధ్యక్షుడు దేవరాజు మాట్లాడుతూ.. మత్స్య సహకార సంఘం 1964 సం.లో  ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర మత్స్య సహకార సంఘం చైర్మన్, అధ్యక్షుడిగా గంగపుత్రులే  కొనసాగుతున్నారని, బీఆర్ఎస్​ప్రభుత్వం ఈసారి ముదిరాజ్ కులస్తులకు చైర్మన్ పదవిని కట్టబెట్టి తమకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధ్యక్షుడు రాజేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రధాన కార్యదర్శి వినయ్, మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.