శ్రీశైలానికి రండి.. ప్రధాని మోడీకి ఎంపీ బైరెడ్డి శబరి ఆహ్వానం..

శ్రీశైలానికి రండి.. ప్రధాని మోడీకి ఎంపీ బైరెడ్డి శబరి ఆహ్వానం..

నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ప్రధాని మోడీని కలిశారు. సోమవారం ( జులై 28 ) భర్త  శివచరణ్ తో కలిసి మోడీని మర్యదపూర్వకంగా కలిసిన ఎంపీ శబరి ప్రధానికి ఆంజనేయస్వాము ప్రతిమను అందజేశారు. అనంతరం నంద్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైల ఆలయాన్ని సందర్శించాలని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మోడీతో నంద్యాల పార్లమెంట్ లో సమస్యలు, అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు వంటి పలు అంశాలపై మోడీకి వివరించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రధాని మోడీ 2018లో శ్రీశైలం వేదికగా జరిగిన రాష్ట్రీయ జన జాగృతి ధర్మమ్ మహా సమ్మేళన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు మోడీ. 

జనవరి 11నుంచి 15వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రీయ ధర్మ జాగృతి మహా సమ్మేళన్‌లో దేశనలుమూలల నుంచి వెయ్యిమందికి పైగా పీఠాధిపతులు, మఠాధిపతులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.