తెల్లారేసరికి చెరువుల్లో చేపలు మృతి

తెల్లారేసరికి చెరువుల్లో చేపలు మృతి

కాగజ్ నగర్, వెలుగు: తెల్లారేసరికి చెరువుల్లోని చేపలు భారీగా మృతి చెందడం కలకలం రేపింది. వేలాది రూపాయలు ఖర్చు చేసి పెంచిన చేపలు చనిపోయి నీళ్ల మీద తేలడం చూసిన రైతులు ఆందోళన  చెందారు. బెజ్జూర్ మండలం అందుగుల గూడ గ్రామ సమీపంలోని చెరువుతోపాటు కౌటాల మండలంలోని మొగడ్ ధగడ్ శివారు చెరువులో పెంచుతున్న చేపలు ఉన్నట్టుండి చనిపోయాయి.

గమనించిన యజమానులు విష ప్రయోగం జరిగినట్టు మొదట అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ.. చెరువుల్లో నీళ్లు తగ్గి చేపలకు ఆక్సీజన్ అందక చనిపోయినట్లు తెలిసింది. ఈ రెండు చోట్లా చేపల మృతితో సుమారు రూ.2 లక్షల నష్టం జరిగినట్టు బాధితులు పేర్కొంటున్నారు.