 
                                    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో జరిగిన మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను దోషులుగా నిర్థారిస్తూ.. ఈ ఐదుగురికి ఉరి శిక్ష విధించింది న్యాయస్థానం. 2025, అక్టోబర్ 31వ తేదీన కోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేసు ఏంటీ అంటే..?
2015వ సంవత్సరం. చిత్తూరు సిటీకి మేయర్ గా ఉన్నారు కటారి అనురాధ. 2015, నవంబర్ 17వ తేదీన కార్పొరేషన్ ఆఫీసులో మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ ఉన్నారు. కొంత మంది వ్యక్తులు మేయర్ ఆఫీసులోకి వచ్చి.. ఆఫీసులోనే మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ ను అక్కడే చంపేశారు. ఈ కేసులో అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఈ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చి పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు.
ALSO READ : మేమున్నాం..రైతులు ఆందోళన చెందొద్దు..
పదేళ్ల విచారణ తర్వాత 57 మంది సాక్షులను విచారించిన కోర్టు.. 23 మందిలో 18 మందిని నిర్దోషులుగా తేల్చింది కోర్టు. ఒకరు చనిపోయారు. మిగిలిన ఐదుగురిని దోషులుగా తేల్చింది కోర్టు. ఏ1 చంద్రశేఖర్ అలియాస్ చింటూ, ఏ2 వెంకట చలపతి, ఏ3 జయ ప్రకాష్ రెడ్డి, ఏ మంజు నాథ్, ఏ5 వెంకటేష్ లు హత్య చేసినట్లు నిర్ధారించిన కోర్టు.. ఈ ఐదుగురికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది చిత్తూరు జిల్లా తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టు.

 
         
                     
                     
                    