మేమున్నాం..రైతులు ఆందోళన చెందొద్దు..మంత్రి వివేక్ వెంకటస్వామి

మేమున్నాం..రైతులు ఆందోళన చెందొద్దు..మంత్రి వివేక్ వెంకటస్వామి

మోంథా తుఫాను కారణంగా మంచిర్యాల జిల్లా అతలా కుతలం అయింది. పంట పొలాలు నీటమునిగాయి. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది.భారీ వర్షాలకు వరి, పత్తి పంటలు వేసిన రైతులు దారుణంగా నష్టపోయారు. మోంథా తుఫాను కారణంగా అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు భరోసా కల్పించారు మంత్రి వివేక్​ వెంకటస్వామి. 

శుక్రవారం ( అక్టోబర్​ 31) మంచిర్యాల నియోజకవర్గంలోని రైతులకు మంత్రి వివేక్​ వెంకటస్వామి వీడియో మేసేజ్​ పంపించారు.  మేమున్నాం.. ఆదుకుంటాం.. ఆందోళన చెందొద్దంటూ  రైతులకు భరోసా ఇచ్చారు. పంటనష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించే ఏర్పాట్లు చేస్తామన్నారు. తక్షణమే పంట నష్టాన్ని అంచనావేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడి నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివేక్​ వెంకటస్వామి చెప్పారు.