పండుగలు వచ్చాయంటే జనాలు సొంతూళ్లు వెళతారు. అదే దసరా.. సంక్రాంతి అంటే చాలు.. ఎక్కడ ఉన్నా సొంతూళ్లలోనే సంబరాలు చేసుకుంటారు. చిన్ననాటి ఊరుకు వెళ్తున్నామన్న సంతోషంలో సొంత వాహనాలు ఉన్న వారు ( కారు) వాటిపైనే వెళ్లేందుకు ఇష్టపడతారు. వచ్చీ రాని.. డ్రైవింగ్.. మితిమీరిన వేగం.. సంక్రాంతి టైంలో మంచుతో రోడ్డు సరిగ్గా కనపడకపోవడం.. వంటి అనేక కారణాలతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. సరిగ్గా ఇప్పుడు అలానే ఖమ్మం జిల్లా వైరా.. హైదారాబాద్ గ్రీన్ ఫీల్డ్హైవేపై ఐదుకార్లకు జరిగిన రెండు ప్రమాదాల్లో ఎనిమిదిమంది గాయపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఖమ్మం జిల్లా వైరాలోఅధికారికంగా ప్రారంభంకాని గ్రీన్ ఫీల్డ్ హైవేపై రెండు ప్రమాదాలు జరిగాయి. హైదరాబాద్ నుంచి దేవరపల్లి వరకు నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారిపై ఈ తెల్లవారుజామున జరిగిన రెండు వేరువేరు ప్రమాదాలలో ఐదు కారుల్లో ప్రయాణిస్తున్న 8 మందికి గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణహాని జరుగలేదు కాని... ఈ ప్రాంతంలో నిర్మించిన అధికారికంగా గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారి ప్రారంభం కాకముందే ఒకే మార్గంలో మితిమీరిన వేగంతో వాహనాల రాకపోకలతో ఈ రోజు ( 2026 జనవరి) తెల్లవారుజామున ఐదు కార్లు ప్రమాదానికి గురయ్యాయి .
అత్యాధునిక హంగులతో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ హైవే ఇంకా అధికారికంగా ప్రారంభోత్సవం జరగలేదు. కాని ఆ రహదారిపై యాక్సిడెంట్ల పరంపర మొదలైంది. ఈ రోజు ( 2026 జనవరి 16) ఉదయం ఈ హైవేపై జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాలు .. వాహనదారులను భయాందోళనకు గురిచేశాయి.
వాహనదారులకు రహదారి నిబంధనల పట్ల అవగాహన లేకపోవడం....అతివేగం... పొగమంచు ప్రమాదానికి కారణమని తెలుస్తుంది . సంక్రాంతి సందర్భంగా పొరుగు జిల్లాల్లో జరుగుతున్న సంక్రాంతి వేడుకలకు .. గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారికంగా ప్రారంభం కాకముందే ... నిబంధనలు పక్కనపెట్టి ఇష్టానుసారంగా వాహనాలు వెళ్లడంతో ఈ ప్రమాదాలు జరిగాయని పలువురు విమర్శిస్తున్నారు.
