ఏనుమాముల మార్కెట్‌కు ఐదు రోజులు సెలవు

ఏనుమాముల మార్కెట్‌కు ఐదు రోజులు సెలవు

వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా ఐదు రోజులు సెలవు ప్రకటించారు. శుక్రవారం బాబు జగ్జీవన్‌రాం జయంతి ఉండగా, శని, ఆదివారాలు మార్కెట్‌కు వారాంతపు సెలవులు. అలాగే సోమవారం అమావాస్య, మంగళవారం ఉగాది సందర్భంగా సెలవు ప్రకటించారు.

శుక్రవారం నుంచి మంగళవారం వరకు రైతులు ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావద్దని ఆఫీసర్లు సూచించారు. 10వ తేదీ బుధవారం మార్కెట్‌ పునఃప్రారంభం అవుతుందన్నారు.