తమిళనాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చిదంబరం నుంచి కడలూరు వెళున్న లారీ ఎదురుగా వస్తున్న కారుని ఢీకొట్టడంతో.. ప్రమాదం జరిగింది.
Also Read :- రేవ్ పార్టీ కేసులో చార్జిషీట్.. హేమ డ్రగ్స్ తీసుకుంది
మృతుల్లో ఓ చిన్నారి,ఇద్దరు మహిళలున్నారు. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం చిదంబరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.