
GHMC ఎన్నికల నిర్వహణ కోసం GHMC, ఎన్నికల సంఘంతో పాటు పోలీసు యంత్రాంగం కూడా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో GHMC ఎన్నికల పరిశీలన అధికారులుగా ఐదుగురు IPS అధికారులను ప్రత్యేకంగా నియమిస్తూ హైదరాబాద్ CP అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈస్ట్ జోన్ పరిశీలన అధికారిగా షికా గోయల్, వెస్ట్ జోన్ అధికారిగా అనిల్ కుమార్, సెంట్రల్ జోన్ తరుణ్ జోషి, నార్త్ జోన్ అవినాష్ మొహంతి, సౌత్ జౌన్‌కు చౌహాన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.