
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అయిదుగురు చనిపోగా.. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఇవాల(శుక్రవారం) ఉదయం జరిగింది. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం వాసులు తిరుమల స్వామివారి దర్శనానికి జైలో వాహనంలో బయల్దేరారు. రేణిగుంట మండలం గురవరాజుపల్లి దగ్గరకు రాగానే ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న రేణిగుంట అర్భన్ పోలీసులు గాయపడిన ఐదుగురిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.