ఐశ్వర్యరాయ్ తో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన అబిషేక్ బచ్చన్.

ఐశ్వర్యరాయ్ తో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన అబిషేక్ బచ్చన్.

బాలీవుడ్ ప్రముఖ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ల వైవాహిక జీవితం గత కొంతకాలంగా పుకార్ల సుడిగుండంలో చిక్కుకుంది. వారిద్దరూ విడిపోతున్నారంటూ ఊహాగానాలు  షికారు చేశాయి. సోషల్ మీడియాలో అయితే ఇక చెప్పక్కర్లేదు. రకరకాల కథనాలు , పోస్టులు వైరల్ అయ్యాయి.  అయితే, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూతో అభిషేక్ బచ్చన్ ఈ పుకార్లకు పూర్తిగా తెరదించారు. 

తన కుటుంబ జీవితం 'సంతోషంగా, ఆరోగ్యంగా' ఉందని అభిషేక్ బచ్చన్ స్పష్టం చేశారు. అంతే కాకుండా, తమ కుమార్తె ఆరాధ్యను నిస్వార్థంగా పెంచుతున్నందుకు భార్య ఐశ్వర్య రాయ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.  తమ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పుకోచ్చారు. సోషల్ మీడియాలో వచ్చే ఫుకార్లు పట్టించుకోవల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు.  తమ దాంపత్య బంధం బలంగా ఉందని స్పష్టం చేశారు.   ఆరాధ్య కుటుంబానికి గర్వకారణం అని పేర్కొన్నారు.

క్రిడిట్ అంతా ఐశ్వర్యకే..!
 సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలు, పోస్టులు, కామెంట్స్ తమపై ప్రభావింతం చూపిచవని అభిషేక్ బచ్చన్ తేల్చిచెప్పారు.   ఆరాధ్య పెంపకం విషయంలో పూర్తి క్రెడిట్ ఐశ్వర్య రాయ్ కే ఇవ్వాలి.   సినిమా షూటింగ్‌లకు వెళ్లే స్వేచ్ఛ  నాకు ఉంది, కానీ ఆరాధ్య విషయంలో ఐశ్వర్యనే ఎక్కువ కష్టపడుతుంది. ఆమె అద్భుతం. నిస్వార్థంగా చేస్తుంది. అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సాధారణంగా తల్లులు, తండ్రులు అంత త్యాగం చేయలేరేమో, బహుశా మా ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి, ఆరాధ్య విషయంలో పూర్తిగా క్రెడిట్ ఐశ్వర్యకే చెందుతుంది అంటూ అభిషేక్ బచ్చన్ ప్రశంసలు కురించారు.

ALSO READ : ఈ బ్యాంక్ మేనేజర్ ఖతర్నాక్ : సర్కార్ సొమ్ము రూ.32 కోట్లను బెట్టింగ్‌లో పెట్టాడు..

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఏప్రిల్ 20, 2007న అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. వారి పెళ్లయిన నాలుగు సంవత్సరాల తర్వాత, నవంబర్ 2011లో వారి కుమార్తె ఆరాధ్య బచ్చన్ జన్మించింది. అప్పటి నుండి, ఈ జంట తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకుంటూనే, తమ బంధాన్ని బలంగా కొనసాగిస్తున్నారు. ఈ తాజా తమపై వస్తున్న విడాకుల పుకార్లకు ఫుల్‌స్టాప్ పడటమే కాకుండా, వారి మధ్య ఉన్న అవగాహన, ప్రేమ, గౌరవం మరోసారి రుజువు చేశారు. ఇప్పటికైనా ఇలాంటి పుకార్లను ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు.