టారిఫ్ లెటర్స్పై ట్రంప్ సంతకం.. డెడ్ లైన్ ముందు 12 దేశాలకు లేఖలు సిద్ధం

టారిఫ్ లెటర్స్పై ట్రంప్ సంతకం.. డెడ్ లైన్ ముందు 12 దేశాలకు లేఖలు సిద్ధం

అమెరికా టారిఫ్స్ గడువు ముగిసే సమయం దగ్గర పడింది. జులై 9 లోపు సుంకాలకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవాలని.. లేదంటే భారీగా టారిఫ్స్ విధిస్తామని ట్రంప్ హెచ్చిరిస్తూ వస్తున్నారు. కొన్ని దేశాలు ముందస్తుగా ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి ఒప్పందాలు చేసుకున్నాయి. మరికొన్ని దేశాలు ఇంకా చర్చల దశల్లోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో డెడ్ లైన్ దగ్గరపడుతుండగా యూఎస్12 దేశాలకు టారిఫ్ లెటర్స్ పంపేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా శనివారం (జులై 05) టారిఫ్ లేఖలపై సంతకాలు చేశారు అధ్యక్షులు ట్రంప్.

అమెరికాకు ఎగుమతి చేసే దేశాలు సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. సోమవారం (జులై 07) 12 దేశాలకు లేఖలు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘టారిఫ్ లేఖలకు తీసుకుంటే తీసుకోండి.. లేదంటే వదిలేయండి.. మేము మాత్రం టారిఫ్ లు వేస్తాం’’ అని హెచ్చరించారు. ఏఏ దేశాలకు లేఖలు పంపుతున్నారో చెప్పేందుకు ఈ సందర్భంగా ట్రంప్ నిరాకరించారు. 

ALSO READ | అరుదైన భూమీతో చైనా ఆధిపత్య పోరు.. భారీ మూల్యం చెల్లించుకుంటున్న డ్రాగన్..

వివిధ దేశాలకు సుంకాలకు సంబంధించి లేకలు శుక్రవారం  పంపిస్తామని ఇదివరకే ట్రంప్ ప్రకటించారు. అయితే సోమవారం టారిఫ్ నోటీసులను పంపించాలని నిర్ణయించారు. శుక్రవారం యూఎస్ నేషనల్ హాలిడే ఉన్నందున సోమవారం పంపించాలని నిర్ణయించారు.

 ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచాక గ్లోబల్ ట్రేడ్ వార్ మొదలయ్యింది. ‘‘చాలా దేశాలు అమెరికాపై ఎక్కువ మొత్తంలో టారిఫ్ వేస్తున్నారు.. మాకు ఎంత వేస్తే మేము అంతే వేస్తాం’’ అనే నినాదంతో మొదలై.. ఇప్పుడు వీలైనంత ఎక్కువ టారిఫ్ లు వేయడం.. లేదంటే టారిఫ్ పేరున నయానో భయానో ఆయా దేశాల్లో అమెరికా ఉత్పత్తులను తక్కువ టారిఫ్ కే ఎగుమతి చేసేందుకు ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. 

అంతే కాకుండా ఇండియా లాంటి పెద్ద మార్కెట్లలో తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి మార్గం సుగమం చేసుకోవాలనే వ్యూహంలో ఉన్నారు. అందులో భాగంగా డెడ్ లైన్ జులై 9తో ముగుస్తుండటంతో టారిఫ్ ఒప్పందాల కోసం ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్.