వాటర్ ఫాల్స్​లో పడి ఐదుగురు గల్లంతు..

వాటర్ ఫాల్స్​లో పడి ఐదుగురు గల్లంతు..

ఫుణె: భూషి డ్యామ్ సమీపంలోని వాటర్ ఫాల్స్ లో పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గల్లంతయ్యారు. ఆదివారం ఫుణెలోని లోనావాలా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ కుటుంబం భూషి డ్యామ్ వద్దకు విహార యాత్రకు వెళ్లింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు డ్యామ్ బ్యాక్ వాటర్ సమీపంలోని వాటర్ ఫాల్ లో వీరు జారిపడ్డారు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో గల్లంతయ్యారు. 

వారిలో ఒక మహిళ, నలుగురు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇద్దరి మృతదేహాలను వెలికితీశాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. కాగా, భూషి డ్యామ్ లోనావాలాలోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. దీనిని ఏడాది పొడవునా భారీ సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తారు.