జుట్టు రాలిపోతుందా..? ఈ చిట్కాలు పాటిస్తే సరి

జుట్టు రాలిపోతుందా..? ఈ చిట్కాలు పాటిస్తే సరి

ప్రతీ ఒక్కరు అందంగా..ఆకర్షనీయంగా కనిపించేందుకు తహతహలాడుతుంటారు. ముఖానికి ఎన్ని క్రీములు పెట్టినా...కురులతో వచ్చే అందమే వేరు. అందుకే అబ్బాయిలు అయినా..అమ్మాయిలు అయినా..తమ కేశాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. అయితే జట్టు రాలిపోతే మాత్రం తట్టుకోలేరు. జట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లే అని అనేక అధ్యయనాల్లో తేలింది.  చాలా మంది బరువు తగ్గాలన్న ఉద్దేశంతో డైట్ పాటిస్తారు. ఫలితంగా జట్టుకు ప్రోటీన్స్ అందించే ఆహారాన్ని వదిలేస్తారు.  దీని ప్రభావంతో వెంట్రుకలు రాలిపోతుంటాయి.బరువు తగ్గినా  జట్టు రాలిపోకుండా ఉండేందుకు కొన్ని ఆహార చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం.

జుట్టు రాలడానికి కారణమేమిటి?

జుట్టు అధికంగా రాలడానికి కారణం పోషకాహార లోపం. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం సాధారణంగా రోజుకు 50 నుంచి -100 వెంట్రుకలు రాలుతాయి. అయితే  వందకు మించి వెంట్రుకలు రాలితే జుట్టు రాలడం అంటారు. ఇందుకు అనేక కారణాలున్నా..అందులో ముఖ్యమైనది పోషకాహార లోపం.  పోషకాహార లోపం కేశాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

పోషకాహార లోపం

ఆహార నియమాలు మనల్ని ఎప్పుడు తప్పదారి పట్టిస్తుంది. ఈ నియమాలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.  న్యూట్రిషనిస్ట్ మోహిత మస్కరెన్‌హాస్ ప్రకారం చాలా మంది ప్రజలు త్వరగా బరువు తగ్గడానికి వీలైనంత తక్కువ తినడానికి ప్రయత్నిస్తారు. దీని కారణంగా అన్నం,  రోటీ, బంగాళాదుంపలు, నెయ్యి, అరటి మొదలైనవాటిని తినకుండా వదిలేస్తారు. దీని వల్ల జుట్టుకు తగిన పోషకాలు అందవు.  దీని కారణంగా  జుట్టు రాలుతుంది. 

చెడు ఆహారపు అలవాట్లు

డైట్‌ల వల్ల శరీరానికి తగిన ఆహారం,  క్యాలరీలు అందవు. ఫలితంగా  కొంత కాలం పాటు శరీరానికి తగినంత స్థూల, సూక్ష్మపోషకాలు లభించవు. దీని ద్వారా కూడా  జుట్టు రాలుతుంది" అని మోహిత మస్సెరెన్హాస్ పేర్కొన్నారు. 

ప్రొటీన్స్  లేని ఆహారం

డెర్మటాలజీ ప్రాక్టికల్ అండ్ కాన్సెప్ట్ ప్రకారం.. పోషకాహార లోపం శరీరంలోని అమైనో ఆమ్లం యొక్క కంటెంట్ ను ప్రభావితం చేస్తుంది.  అమైనో ఆమ్లాలు జుట్టు పెరుగుదలలో కెరాటిన్ ఉత్పత్తికి దోహదపడతాయి. అందువల్ల తగినంత ప్రోటీన్ లేని తక్కువ కేలరీల బరువు తగ్గించే ఆహారం తీసుకుంటున్నప్పుడు జుట్టు  గణనీయంగా రాలిపోతుంది. డెర్మటోలాజికల్ క్లినిక్స్ జర్నల్‌లో ప్రచురించిన  అధ్యయనం ప్రకారం ఐరన్, జింక్, ప్రొటీన్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లోపాలు జట్టు రాలడానికి దారితీస్తాయి. 

జుట్టు ఆరోగ్యం కోసం 5 డైట్ చిట్కాలు:

డైట్ ఫాలో అవుతున్నప్పుడు జుట్టు పెంచుకోవాలి అనుకుంటే... ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారంపై దృష్టి పెట్టాలి.  దీనికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. 

1. హైడ్రేటెడ్ గా ఉండండి : శరీరం నుంచి ఫ్లష్ ను  బయటకు పంపడానికి తగినంత నీరు త్రాగటం ముఖ్యం. ఇది బరువు తగ్గడంతో పాటు రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా  జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది.

2. ప్రోటీన్‌ ఆహారం తినండి : ఆరోగ్యంగా ఉండాలంటే బరువు తగ్గించే ప్రోటీన్స్తో కూడిన కొన్ని రకాల  ఆహారం తినడం ముఖ్యం.  ప్రొటీన్స్ బరువు తగ్గించడంతో పాటు.. జుట్టు మూలాల్లో కెరాటిన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది.

3. సీజనల్ పండ్లు, కూరగాయలు తినాలి : డాక్టర్లు, ఇతర నిపుణులు తరచూ చెప్పే మాట ఒకటే ఆకుకూరలు తినండి అని.  ఎందుకంటే అవి శరీరానికి తగిన పోషకాలు అందిస్తాయి. ఆకుకూరలు,  సీజనల్ పండ్లలో ఆరోగ్యానికి ఉపయోగపడే  పోషకాలు ఉంటాయి. 

4. త్వరగా బరువు తగ్గాలన్న ఆలోచన వద్దు : బరువు తగ్గడం అనేది సమయం, సహనం, అంకితభావంతో కూడిన పని.  కానీ ఈ రోజుల్లో బరువు తగ్గేందుకు విభిన్నమైన ఆహార నియమాలను పాటిస్తారు. అయితే పోషకాలతో కూడిన ఆహారాన్ని మానేస్తే బరువు తగ్గరని .. పోషకాలతో కూడిన ఆహారాన్ని శరీరానికి అందించాలని సూచిస్తున్నారు. అలాగైతే బరువు ఈజీగా తగ్గొచ్చని చెప్తున్నారు.

5. జంక్ ఫుడ్‌ను నివారించండి :  నూనె, కొవ్వు పదార్థాలు, ట్రాన్స్-ఫ్యాట్స్ వంటివి అనారోగ్యం పాలు చేస్తుంది. ఫాస్ట్ ఫుడ్ లాంటి జంక్ ఫుడ్  తరచుగా, ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు పోషకాల లోపానికి దారి తీస్తుంది, ఇది జుట్టు రాలడం, బరువు పెరగడానికి దారితీస్తుంది.