ఏపీలో ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతులు రద్దు

ఏపీలో ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతులు రద్దు

ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్దంగా అధిక ఫీజులు వసూల్ చేస్తున్నారని రోగుల నుంచి ఫిర్యాదులు రావడంతో.. ప్రభుత్వం విచారణ జరిపింది. ఆరోపణలు నిజమేనని తేలడంతో విజయవాడలోని ఐదు కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రమేష్ హాస్పిటల్స్ అధ్వర్యంలోని స్వర్ణ హైట్స్, ఎనికేపాడులో డా. లక్ష్మీ నర్సింగ్ హోమ్ అధ్యర్యంలోని హోటల్ అక్షయ, బెంజ్ సర్కిల్ లోని ఇండో బ్రిటిష్ హాస్పిటల్ అధ్వర్యంలోని హోటల్ ఐరా, NRI హీలింగ్ హ్యాండ్స్ అధ్వర్యంలోని సన్ సిటీ, మరియు ఆంధ్రా హాస్పిటల్స్ అధ్వర్యంలోని మార్గ్ కృష్ణయ్య హోటళ్లలోని కోవిడ్ కేర్ సెంటర్లకు అనుమతులు రద్దు చేసింది.

For More News..

ప్రేమించిందని నవ వధువును స్టేషన్ లో వదిలేసిన తల్లిదండ్రులు, వరుడు

రాష్ట్రంలో కొత్తగా 3,018 కరోనా కేసులు

కరోనాతో జగిత్యాల అడిషినల్ ఎస్పీ మృతి