ఈ వారం ఇన్వెస్టర్ల ముందుకు 5 ఐపీఓలు

ఈ వారం  ఇన్వెస్టర్ల ముందుకు 5 ఐపీఓలు

న్యూఢిల్లీ: ఈ వారం ఐదు ఎస్‌‌‌‌‌‌‌‌ఎంఈ ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి. మెయిన్ బోర్డ్ ఐపీఓ ఆఫిస్ స్పేస్‌‌‌‌‌‌‌‌ సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌  సోమవారంతో ముగుస్తుంది.  
మే 30 న ఈ కంపెనీ షేర్లు మార్కెట్‌‌‌‌‌‌‌‌లో  లిస్టింగ్ కానున్నాయి. ఒక్కో షేరు రూ.383 దగ్గర అందుబాటులో ఉంది. 

ఎస్‌‌‌‌‌‌‌‌ఎంఈ ఐపీఓలు..

1. పవర్ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్ కాంపోనెంట్లను తయారు చేసే  విలాస్‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐపీఓ సోమవారం ఓపెన్ కానుంది. మే 29 న ముగుస్తుంది. ఒక్కో షేరుని రూ.139–147 ధరకు  అమ్ముతున్నారు. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.95.26 కోట్లు సేకరించాలని కంపెనీ చూస్తోంది. 
2. బీకాన్‌‌‌‌‌‌‌‌ ట్రస్టీషిప్‌‌‌‌‌‌‌‌ ఐపీఓ మే28 న ఓపెన్ కానుండగా, మే30 న ముగియనుంది. ఒక్కో షేరు రూ.57–60 రేంజ్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంటుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.32.52 కోట్లను బీకాన్‌‌‌‌‌‌‌‌ ట్రస్టీషిప్‌‌‌‌‌‌‌‌ సేకరించాలని చూస్తోంది. 
3. సివిల్ ఇంజినీరింగ్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను డిజైన్ చేసే జెడ్‌‌‌‌‌‌‌‌టెక్‌‌‌‌‌‌‌‌ ఇండియా  ఈ నెల 29 న ఇన్వెస్టర్ల ముందుకొస్తోంది. కంపెనీ ఐపీఓ ఈ నెల 31న ముగుస్తుంది.  షేరు ధర రూ.104–110.
4. ఎయిమ్‌‌‌‌‌‌‌‌ట్రాన్‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రానిక్స్ షేరు  రూ.153–161 రేంజ్‌‌‌‌‌‌‌‌లో ఐపీఓలో అందుబాటులో ఉంటాయి. కంపెనీ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 30న ఓపెన్ అవుతుంది. జూన్   3 న ముగుస్తుంది. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ డిజైన్‌‌‌‌‌‌‌‌ చేసే ఈ కంపెనీ రూ.87.02 కోట్లు సేకరించనుంది. 
5.టీబీఐ కార్న్‌‌‌‌‌‌‌‌ ఐపీఓ ఈ నెల 31 న ఓపెన్ అవుతుంది. జూన్ 4 న ముగస్తుంది. ఒక్కో షేరుని రూ.90–94 ప్రైస్‌‌‌‌‌‌‌‌ రేంజ్‌‌‌‌‌‌‌‌లో అమ్ముతున్నారు. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.44.94 కోట్లు సేకరించాలని కంపెనీ చూస్తోంది.