ఓయూ, వెలుగు: ఓయూలో ఫ్లెక్సీల లొల్లి విద్యార్థి లీడర్ల మధ్య ఘర్షణకు దారి తీసింది. మంగళవారం క్యాంపస్ లో నిర్వహించిన గణేశ్నిమజ్జన ర్యాలీలో ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ , టీఎన్ఏ విద్యార్థి లీడర్ల మధ్య గణేష్ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో గొడవ మొదలైంది. తమ ఫ్లెక్సీలు చింపారంటే.. తమ ఫ్లెక్సీలు చింపారంటూ ఏబీవీపీ స్టూడెంట్లీడర్లు, ఎన్ఎస్యూఐ ,టీఎస్ఏ లీడర్లతో గొడవ కు దిగారు. దీంతో ఇరు గ్రూపుల మధ్య మాటామాటా పెరిగి సరస్పరం దాడులు చేసుకున్నారు.
ఎన్ఎస్యూఐ విద్యార్థి లీడర్ చందు, టీఎస్ఏ నాయకుడు ఎన్ఎం శ్రీకాంత్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఓయూ పోలీసులు చందు, శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకొని పీఎస్కు తరలించారు. క్యాంపస్ లో తమ ఫ్లెక్సీలను ఏబీవిపీ లీడర్లు చింపారని ఎన్ఎస్యూఐ విద్యార్థి లీడర్లు చెబుతుంటే, తమ ఫ్లెక్సీలను కాంగ్రెస్ విద్యార్థి సంఘ నాయకులు చింపుతుంటే అడ్డుకున్నామని,దీంతో తమపైనే వారు దాడికి పాల్పడ్డారని ఏబీవీపి లీడర్లు చెప్తున్నారు.