విమాన ప్రయాణికులకు కొత్త ఆఫర్.. లగేజ్ లేకపోతే చార్జీలో రాయితీ

విమాన ప్రయాణికులకు కొత్త ఆఫర్.. లగేజ్ లేకపోతే చార్జీలో రాయితీ
  • లగేజీ లేకుంటే చార్జీ తగ్గుతది
  • విమాన ప్రయాణికులకు కొత్త ఆఫర్.. కొత్త రూల్ కు డీజీసీఏ ఆమోదం

న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులు ఇకపై లగేజీ లేకుండా వస్తే టికెట్ చార్జీని తగ్గించనున్నారు. పూర్తిగా లగేజీ లేకుండా లేదా క్యాబిన్ బ్యాగేజ్ మాత్రమే తెచ్చుకునేవారికి టికెట్ చార్జీలో కన్సెషన్ ఇచ్చేందుకు అనుమతించాలంటూ ఎయిర్ లైన్స్ కంపెనీలు కోరగా, అందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్​ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం.. విమాన ప్రయాణికులు 7 కిలోల క్యాబిన్ బ్యాగేజ్, 15 కిలోల చెక్​ఇన్ బ్యాగేజ్​ను తెచ్చుకుంటే ఎలాంటి బ్యాగేజ్ చార్జీలు ఉండవు. ఇంతకంటే ఎక్కువ బరువున్న లగేజీ తెచ్చుకుంటే వెయిట్ చార్జీని వసూలు చేస్తారు. అయితే ఎలాంటి లగేజ్ లేకుండా లేదా క్యాబిన్ బ్యాగేజ్ మాత్రమే తెచ్చుకునే ప్యాసింజర్లకు టికెట్ రేటును తగ్గించేందుకు అనుమతించాలని డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ కంపెనీలు కోరగా, డీజీసీఏ ఓకే చెప్పింది. ఈ కన్సెషన్​ను పొందేందుకు ప్యాసింజర్లు టికెట్ బుకింగ్ టైంలోనే తమ లగేజీ బరువు గురించి చెప్పాల్సి ఉంటుంది.