వట్ ​ఎన్ బిజినెస్​ ఐడియా సర్​జీ.. ఫ్లిప్​కార్టా.. మజాకా..

వట్ ​ఎన్ బిజినెస్​ ఐడియా సర్​జీ..  ఫ్లిప్​కార్టా.. మజాకా..

నగరాలు, పట్టణాల్లో బడా నుంచి చోటా కంపెనీల వరకు తమ బ్రాండ్​ ప్రొడక్ట్​లను పబ్లిసిటీ చేసుకోవాలని యూజ్​ చేయని  ట్రిక్స్​ ఉండవు. గోడలపై పంప్లెట్​ల నుంచి ఆకాశంలో అంతలా కనిపించే  హోర్డింగ్​ల వరకు ఏది కనిపిస్తే అది తమ ప్రచారానికి వాడుకుంటారు. డబ్బులిచ్చి ప్రకటనలు ఇచ్చినా.. అందరిలో  ప్రత్యేకంగా నిలిచిన వాడే  గేమ్​ చేంజర్​గా మారతాడు. 

ఈ సత్యాన్ని వంటబట్టించుకున్నట్లుంది ఫ్లిప్​కార్ట్. దాని బిజినెస్​ ఐడియా చూసిన పబ్లిక్ వారేవ్వా.. అంటున్నారు. తోటి పోటీదారులు సైతం దాని ఐడియాకు మెచ్చుకోక మానరు. ఇంతకు దాని బిజినెస్​ ఐడియా కథేంటని అనుకుంటున్నారా.. ప్రణవ్​ మైలర్​ పవార్​ అనే ట్విటర్​ యూజర్​కొన్ని హోర్డింగ్​లు ఒకే చోట ఉన్న ఫొటోని షేర్​ చేశాడు. ఇందులో శాంసంగ్, పుమా, సోనీ, ఎసస్​ తదితర హోర్డింగ్లు కనిపిస్తున్నాయి. ఇందులో తమ హోర్డింగ్​పెట్టి పబ్లిసిటీ చేసుకుంటే అందులో కొత్తేముందనుకున్నట్టుంది ఫ్లిప్​కార్ట్. డిఫరెంట్​గా ఆలోచించింది. 

దానికున్న బలాన్నే.. ప్రత్యర్థుల బలహీనతగా మార్చి పబ్లిసిటీ చేయాలనుకుంది. అర్థం కాలేదా.. అది తన హోర్డింగ్​లో 'మన చుట్టూ 7  కంపెనీల ప్రకటనలు ఉన్నాయి. హర్​అద్​మే జో దిఖ్తా హై, వో ఫ్లిప్​కార్ట్​పే మిల్తా హై' అని అందులో రాసి ఉంది. అంటే తన చుట్టూ ఉన్న బడా కంపెనీల ప్రచార హోర్డింగ్లలో మెన్షన్​ చేసిన వస్తువులన్నీ ఫ్లిప్​కార్ట్​లో దొరుకుతాయని దానర్థం. 

చిన్న బిజినెస్​ ఐడియా ఆ కంపెనీకి బోలేడు ప్రచారం తెచ్చిపెట్టడంతో పాటు.. జనాలను వారెవ్వా.. క్యా.. బాత్​హై అనేలా చేసింది. బిజినెస్​ ఐడియా అంటే ఇలా ఉండాలి అనిపిస్తోంది కదూ..!