మహిళల కోసం ఫ్లిప్కార్ట్ వర్క్షాప్

మహిళల కోసం ఫ్లిప్కార్ట్ వర్క్షాప్

హైదరాబాద్, వెలుగు: ఈ–-కామర్స్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేస్ ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్,  వీహబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం హైదరాబాద్​లో శుక్రవారం వర్క్​షాప్​ నిర్వహించింది. ఈ–-కామర్స్ ద్వారా మహిళలు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి అవసరమైన సాయం, పరిజ్ఞానం,  సాధనాలు అందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 

ఈ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వీ హబ్ అసోసియేట్ డైరెక్టర్ ఉహా సజ్జ,  ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్ గ్రూప్ పబ్లిక్ పాలసీ హెడ్ డాక్టర్ తఫీమ్ సిద్ధిఖీ హాజరయ్యారు. ఈ–-కామర్స్ అవకాశాలపై అవగాహన పెంచడం, వారి వ్యాపారాలను విస్తరించడానికి అవసరమైన సాధనాలను అందించడం ద్వారా మహిళా వ్యవస్థాపకులపై ఈ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్  దృష్టి సారించింది.   

ఉత్పత్తి జాబితా, ధరల వ్యూహాలు గురించి ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఈ సెషన్ లలో పాల్గొనేవారు జాతీయ మార్కెట్లలో  ప్రవేశించవచ్చని ఫ్లిప్​కార్ట్​తెలిపింది.