మహిళా ఎంట్రప్రెనూర్లకు సాయం చేయడానికి...  టీ-హబ్​తో ఎఫ్​ఎల్​ఓ జోడీ

మహిళా ఎంట్రప్రెనూర్లకు సాయం చేయడానికి...  టీ-హబ్​తో ఎఫ్​ఎల్​ఓ జోడీ

హైదరాబాద్​, వెలుగు: తన సభ్యులకు బిజినెస్​లో సాయం అందించడానికి, గైడ్​ చేయడానికి ఫిక్కీ లేడీస్​ ఆర్గనైజేషన్​(ఎఫ్​ఎల్​ఓ) టీ–హబ్​తో ఒప్పందం కుదుర్చుకుంది.  స్టార్టప్ ఎకోసిస్టమ్ ను ఇంకా విస్తరించడానికి, మహిళా ఎంట్రప్రెనూర్లను  శక్తిమంతం చేయడానికి ఈ రెండు సంస్థలు కలిసి పనిచేస్తాయి. ఇందుకోసం ఒక ఎంఓయూ కుదుర్చుకున్నాయి.  తెలంగాణలో మహిళా ఎంట్రప్రెనూర్లకు వనరులు, మార్గదర్శకత్వం, నిధులు అందేలా సాయం చేస్తామని ప్రకటించాయి.

మహిళల్లో ఇన్నోవేషన్​ను, ఎంట్రప్రెనూర్​షిప్​ను ఎంకరేజ్​ చేసేలా చూస్తామని ఎల్​ఎల్​ఓ చైర్​పర్సన్​ రీతూ షా అన్నారు. స్కూల్​దశలోనే ఎంట్రప్రెనూర్​గా మారాలనుకునే వారికో త్వరలో వర్క్‌‌‌‌షాప్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్యానెల్​ చర్చలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్​ సెక్రెటరీ జయేశ్​ రంజన్​ మాట్లాడుతూ మహిళల బిజినెస్​లకు మరింత సహకరించడానికి వై–హబ్​ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ఇందులో ట్రైనింగ్​ తీసుకోవడానికి స్కూల్స్​ రిజిస్ట్రేషన్​ చేసుకోవాలని కోరారు. చిన్న వయసులోనే ఎంట్రప్రెనూర్లుగా మారాలనుకునే వారిని గైడ్​ చేస్తామన్నారు.  తెలంగాణ ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలకు సహాయపడడానికి  సింగిల్ విండో సదుపాయంతో ముందుకు రావాలని భావిస్తోందని జయేష్ రంజన్ తెలిపారు. కార్యక్రమంలో టీ–హబ్​ సీఈఓ శ్రీనివాసరావు మహంకాళి, వీ–హబ్​ సీఈఓ దీప్తి రావుల తదితరులు పాల్గొన్నారు.