వరద పరిహారంపై విచారణ జరగాలి: దాసోజు శ్రవణ్

వరద పరిహారంపై విచారణ జరగాలి: దాసోజు శ్రవణ్

హైదరాబాద్ లో వచ్చిన వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రకటించిన వరద పరిహారంపై విచారణ జరగాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. వరద బాధితుల పట్ల ప్రభుత్వం అమానీయంగా వ్యవహరించిందని అన్నారు. వరద బాధిత కుటుంబాలకు 10 వేలు లెక్కన ఇస్తామన్నారు. కానీ  పరిహారం అందజేయడంలో టీఆర్ఎస్ నాయకులు,GHMC అధికారులు అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. వరద సహాయ నిధులను దోచుకు తిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడంలో కూడా కక్కుర్తి పడ్డారని.. ఒక్కో కార్పొరేటర్ రూ.10 లక్షల వరకు దండుకున్నారని ఆరోపించారు. అంతేకాదు..వరద సహాయం పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల పిటిషన్ వేయనున్నట్లు వేసినట్లు తెలిపారు దాసోజు శ్రవణ్ .