బిరబిరా కృష్ణమ్మ: జూరాల ప్రాజెక్ట్ కు వరద ఉధృతి

బిరబిరా కృష్ణమ్మ: జూరాల ప్రాజెక్ట్ కు వరద ఉధృతి

ఎగువన  కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ  పరుగులు పెడుతోంది. జూరాల ప్రాజెక్ట్ కు వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు 57 గేట్లు ఓపెన్ చేశారు అధికారులు. ఇన్ ఫ్లో 7 లక్షల 50 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో… దిగువకు 7 లక్షల 69 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో 8 యూనిట్లలో 334 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 318 అడుగులకు.. ప్రస్తుతం  316 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9 టీఎంసీలు కాగా..  ప్రస్తుతం 5టీఎంసీల నీరు చేరింది.