ఉస్మాన్, హిమాయత్ సాగర్కు కొనసాగుతున్న వరద

ఉస్మాన్, హిమాయత్ సాగర్కు కొనసాగుతున్న వరద

హైదరాబాద్ : జంట జలాశయాలకు వరద కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లు నిండు కుండను తలపిస్తున్నాయి.  భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 3.900టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 3.008 టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో 200 క్యూసెక్కులు ఉండగా.. రెండు గేట్లను ఒక ఫీటు మేర ఎత్తి 208 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 

హిమాయత్ సాగర్ కు సైతం వరద కంటిన్యూ అవుతోంది.  జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 2.970-  టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 2.363 టీఎంసీలు ఉంది. 350 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. రెండు గేట్లను  0.6ఫీట్ల మేర ఎత్తిన అధికారులు 340క్యూసెక్కుల వరద నీటికి కిందకు వదులుతున్నారు.