న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్ లో ఉద్యోగాలు.. ఐటిఐ చేసినోళ్లకే ఛాన్స్.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్ లో ఉద్యోగాలు.. ఐటిఐ చేసినోళ్లకే ఛాన్స్.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్​సీ) అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టులు: 405. 

పోస్టుల సంఖ్య: ఫిట్టర్ 126, టర్నర్ 35, ఎలక్ట్రీషియన్ 53, మెషినిస్ట్ 17, అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్) లేదా కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ 23, ఇనుస్ట్రమెంట్స్ మెకానిక్స్ 19, ఎలక్ట్రానిక్స్ మెకానిక్​ 24, లాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్రాంట్) 01, మోటార్ మెకానిక్​ (వెహికల్) 04, డ్రాఫ్ట్స్ మెన్ (మెకానికల్)  03, కంప్యూటర్  ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 59, డీజిల్ మెకానిక్ 04, కార్పెంటర్ 05, ప్లంబర్ 05, వెల్డర్ 26, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్) 01.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 28. 

లాస్ట్ డేట్: నవంబర్ 15. 

సెలెక్షన్ ప్రాసెస్: ఎలక్ర్టీషియన్ మినహా ఇతర ట్రేడ్లకు అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. ఎలక్ట్రీషియన్ ఖాళీలకు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు nfc.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.