నీటిలోనే ప్యాట్నీ నగర్ కాలనీ

నీటిలోనే ప్యాట్నీ నగర్ కాలనీ

హైదరాబాద్‌‌లో కురిసిన వర్షానికి బేగంపేటలోని ప్యాట్నీ నగర్ కాలనీ వాసులు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. దీంతో భారీగా వరద నీరు పోటెత్తింది. ఎక్కడికక్కడనే నీళ్లు నిలిచిపోవడంతో కాలనీ వాసులు బయటకు రాలేకపోయారు. సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. కానీ... ఇది తమ పరిధిలోకి రాదని జీహెచ్ఎంసీ పేర్కొంటోంది. దీంతో సమస్యను ఎవరు పరిష్కరిస్తారని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితి తెలుసుకొనేందుకు v6 ప్రయత్నించింది.

మోకాళ్ల లోతులో నీళ్లు నిలవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి ఇదే పరిస్థితి నెలకొందని వెల్లడించారు. కంటోన్మెంట్ సిబ్బందికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. కాలనీల్లోని నడవలేని పరిస్థితి ఉందని వాపోతున్నారు. రోడ్డుకు అవతలి వైపు.. జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుందన్నారు. ఈ కాలనీలో భాస్కర్ క్లినిక్ లో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ప్యాట్నీ కాలనీ వాసులు కోరుతున్నారు.