నిండు కుండలా హుస్సేన్ సాగర్

నిండు కుండలా హుస్సేన్ సాగర్

హైదరాబాద్, వెలుగు : సిటీ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్​కు వరద పెరిగింది. ఆదివారం కురిసిన వానకు నిండు కుండలా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం అధికారులు సాగర్​నీటి మట్టాన్ని నిరంతరం పరిశీలిస్తున్నారు.

హుస్సేన్​సాగర్​ఫుల్​ట్యాంక్​లెవల్ 513.41 మీటర్లు కాగా.. సోమవారం అర్ధరాత్రి వరకు 513.43 మీటర్ల మేర నీరు ఉంది. ఎప్పటికప్పుడు అలుగులు, తూము ద్వారా నీటిని కిందికి పంపుతున్నారు.