త్వరలో ఫ్లై91 సర్వీస్‌‌‌‌‌‌‌‌లు

త్వరలో ఫ్లై91 సర్వీస్‌‌‌‌‌‌‌‌లు

న్యూఢిల్లీ: గోవాకు చెందిన రీజనల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీ ఫ్లై91 డీజీసీఏ నుంచి ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్‌‌‌‌‌‌‌‌ (ఏఓసీ)  ను బుధవారం అందుకుంది. కమర్షియల్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లు స్టార్ట్ చేయడానికి అవసరమయ్యే ఇతర అనుమతులను ఇప్పటికే  తీసుకుంది.

కంపెనీ త్వరలో తన సర్వీస్‌‌‌‌‌‌‌‌లను ప్రారంభించనుంది.  రీజనల్  ఎయిర్ కనెక్టివిటీ (ఉడాన్‌‌‌‌‌‌‌‌) కింద  రూట్‌‌‌‌‌‌‌‌లను కూడా ప్రభుత్వం కేటాయించింది.  ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీ మహారాష్ట్రలోని సింధు‌‌‌‌‌‌‌‌దుర్గ్‌‌‌‌‌‌‌‌, జల్​గావ్​, నాందేడ్‌‌‌‌‌‌‌‌, లక్షద్వీప్‌‌‌‌‌‌‌‌లోని అగత్తికి సర్వీస్‌‌‌‌‌‌‌‌లు ప్రారంభించనుంది.