ఇక అది చరిత్ర : బ్రిటానియా బిస్కెట్ కంపెనీ ఫస్ట్ ఫ్యాక్టరీ మూసివేత

ఇక అది చరిత్ర : బ్రిటానియా బిస్కెట్ కంపెనీ ఫస్ట్ ఫ్యాక్టరీ మూసివేత

బిస్కెట్ల తయారీలో బ్రిటానియా కంపెనీ మోస్ట్ ఫేమస్. మ్యారి గోల్డ్, గుడ్ డే వంటి బిస్కట్లను భారత దేశం అంతటా బ్రిటానియా కంపెనీ సరఫరా చేస్తోంది. ఈ కంపెనీ బిస్కట్లు కొన్ని దశాబ్దాలుగా అమ్ముతుడవుతున్నాయి కొత్త కంపెనీలు ఎన్ని వచ్చినా.. బ్రిటానియా బిస్కట్లు అంటే దేశ ప్రజలు చాలా ఇష్టంగా తింటారు. 1947లో కోల్ కతా లో బ్రిటానియా కంపెనీని మొదట స్థాపించారు. తర్వాత దేశమంతటా విస్తరించారు. అయితే ఈ కంపెనీని మూసివేస్తున్నట్లు బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇటీవల ప్రకటించింది. ఎందుకు.. దీనివల్ల మనం బ్రిటానియా బిస్కెట్లను ఇకపై తినలేమా?.. కంపెనీ మూసివేతలో ఏమైనా నష్టాలు ఉన్నాయా తెలుసుకుందాం.. 

మొదటి యూనిట్.. దశాబ్దాలుగా దేశ ప్రజలకు బిస్కట్లను అందించిన కోల్ కతా యూనిట్ ను మూసివేస్తున్నట్టు కంపెనీ ఫైలింగ్ లో తెలిపింది బ్రిటానియా కంపెనీ. అయితే ఈ యూనిట్ మూసివేయడం వల్ల కంపెనీ ఉత్పత్తుల్లో ఎలాంటి తేడా ఉండదని.. అంటే బిస్కట్లు ఎప్పటిలాగే దొరుకుతాయని తెలిపింది. మరో విషయం కూడా చెప్పింది. కంపెనీలో పనిచేస్తున్న పర్మినెంట్ వర్కర్లకు వీఆర్ ఎస్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి కంపెనీ వర్కర్లు కూడా ఒప్పుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఆర్థిక సమస్యల వల్ల  కోల్ కతా లోని తారటాలా ఫ్యాక్టరీని మూసివేస్తున్నామని కంపెనీ పైలింగ్ లో తెలిపింది. 

కంపెనీలో మొత్తం 150 మంది ఉద్యోగులున్నారు. కంపెనీ మూసివేతతో వారిపై ప్రభావం పడుతుండటంతో కార్మికులకు స్వచ్ఛంద పదవీ విరమణ( వీఆర్ ఎస్) ప్యాకేజీలను అందిస్తోంది బ్రిటానియా కంపెనీ.