రోజూ వాడే వస్తువుల అమ్మకాలు పల్లెల్లోనే ఎక్కువ.. చిన్న ప్యాక్లకు డిమాండ్ పెరుగుతుండటంతో..

రోజూ వాడే వస్తువుల అమ్మకాలు పల్లెల్లోనే ఎక్కువ.. చిన్న ప్యాక్లకు డిమాండ్ పెరుగుతుండటంతో..
  • ఎఫ్ఎంసీజీ అమ్మకాలు స్లో.. గ్రామీణ మార్కెట్​ కాస్త బెటర్​
  •     వృద్ధి 5.4 శాతం డౌన్​
  •     నీల్సన్​ ఐక్యూ రిపోర్ట్​ వెల్లడి

న్యూఢిల్లీ: జీఎస్​టీ రేట్ల తగ్గింపు, ఇతర ఇబ్బందుల వల్ల సబ్బులు, బిస్కెట్లు, నూడుల్స్​ వంటి  ఫాస్ట్​ మూవబుల్ ​కన్జూమర్ ​ప్రొడక్ట్స్​(ఎఫ్​ఎంసీజీ) రంగం అమ్మకాల వృద్ధి నెమ్మదించింది. డేటా అనలిటిక్స్​ సంస్థ నీల్సన్​ ఐక్యూ తాజా రిపోర్ట్​ ప్రకారం, 2025 సెప్టెంబర్​ క్వార్టర్​లో ఎఫ్​ఎంసీజీ అమ్మకాల పరిమాణం పరంగా​ వృద్ధి 5.4 శాతానికి తగ్గింది.  విలువపరంగా వృద్ధి మాత్రం 12.9 శాతానికి పెరిగింది. గ్రామీణ మార్కెట్​ వృద్ధి కూడా ఏడాది ప్రాతిపదికన 8.4 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గింది. 

అయినప్పటికీ, ఇది వరుసగా ఏడో క్వార్టర్​లోనూ పట్టణ ప్రాంతాల కంటే మెరుగైన అమ్మకాలను సాధించింది. ఈ క్వార్టర్​లో మార్కెట్​ సైజులో 5.4 శాతం పెరుగుదల నమోదు కాగా, ధరలు 7.1 శాతం పెరిగాయి.  కస్టమర్లు చిన్న ప్యాక్​ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎఫ్​ఎంసీజీ డిమాండ్​లో మెజారిటీ వాటా ఉండే పట్టణ మార్కెట్​,  చిన్న పట్టణాల్లో మాత్రం కొంతవరకు కోలుకుంటోంది.  సుమారు 38 శాతం ఎఫ్​ఎంసీజీ డిమాండ్​ ఉండే గ్రామీణ మార్కెట్​కు చిన్న ప్యాకెట్లు కీలకం. గ్రామీణ భారతదేశం 7.7 శాతం వృద్ధిని నమోదు చేయగా, పట్టణ ప్రాంతాలు 3.7 శాతం వృద్ధిని సాధించాయి.  పట్టణ ప్రాంతాలు మెల్లగా కోలుకుంటుండటంతో ఈ అంతరం తగ్గుతోంది.  

ఈ–కామర్స్​ హవా..

2025 మార్చి క్వార్టర్లో, సెప్టెంబర్​ క్వార్టర్లో గ్రామీణ మార్కెట్​ వరుసగా 8.3 శాతం, 8.4 శాతం వృద్ధిని నమోదు చేసింది.  మెట్రోపాలిటన్​ ప్రాంతాలవాసులు ఈ-–కామర్స్ కంపెనీల వైపు మారడం వల్ల ఆఫ్‌‌‌‌లైన్​ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.  ‘‘పట్టణ మార్కెట్లలో రికవరీ వేగం పుంజుకుంటున్నప్పటికీ, అమ్మకాల పెరుగుదలకు గ్రామీణ డిమాండ్​ కీలకం. ముఖ్యంగా టాప్​ ఎనిమిది మెట్రోల్లో ఈ–-కామర్స్ ద్వారా అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుతుండటంతో ఇక నుంచి వినియోగం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి” అని నీల్సన్​ఐక్యూ రిపోర్ట్​ పేర్కొంది.