
- అధికారులకు బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు : బల్దియా పరిధిలో ట్యాక్స్ కలెక్షన్ పై శుక్రవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఏఏంసీలతో కమిషనర్ రోనాల్డ్ రాస్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్ను వచ్చే ఏడాది ఫిబ్రవరి లోగా పూర్తి చేయాలన్నారు.
ఈ ఏడాది నవంబర్ నెలలో ట్యాక్స్ కలెక్షన్ నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తి కాలేదన్నారు. సర్కిల్ వారీగా పెండింగ్ టాక్స్ కలెక్షన్ వసూలు చేయాలని, సర్కిల్ లో టాప్ 100 డిపాల్టర్స్ పై దృష్టి పెట్టాలన్నారు. ప్రతిరోజు బిల్ కలెక్టర్ ట్యాక్స్ వసూలు పై రివ్యూ చేయాలన్నారు. సిటీ వ్యాప్తంగా 18.9 లక్షల ప్రాపర్టీలకు సంబంధించి ఈ నెల 20 నాటికి రూ. 1208.35 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ సేకరించామని ఆయన తెలిపారు.