బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యువత, మహిళలపై  ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యువత, మహిళలపై  ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

 న్యూఢిల్లీ :  రానున్న బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  యువత, మహిళలు, రైతులు, పేదవారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినిస్టర్  నిర్మలా సీతారామన్ గురువారం పేర్కొన్నారు. వీరికి మేలు చేసేలా పాలసీలు తీసుకొస్తామని చెప్పారు.  ఎర్ర సముద్రం సంక్షోభం వంటి గ్లోబల్ టెన్షన్లు కొనసాగుతున్నా ఇండియా తన కాళ్లపై తాను నిలబడిందని సీతారామన్ అన్నారు. మన నుంచి  ఫుడ్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను దిగుమతి చేసుకోవడానికి చాలా దేశాలు  లాంగ్ టెర్మ్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయని చెప్పారు. నూనె గింజలు, పప్పులు మినహా మిగిలిన వ్యవసాయ ఉత్పత్తుల్లో మనకు అవసరమయ్యేంత మనం పండించుకోగలుగుతున్నామని పేర్కొన్నారు. అగ్రి కల్చర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బోలెడు అవకాశాలు ఉన్నాయి. ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రీసెర్చ్,  డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనుల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నామని సీతారామన్ వివరించారు.