దేశ రాజకీయాల్లో సంచలనం: పాలిటిక్స్‎లోకి ఎంట్రీ ఇచ్చిన ఒక్క నెలలోనే ఎమ్మెల్యే అయిపోయింది

దేశ రాజకీయాల్లో సంచలనం: పాలిటిక్స్‎లోకి ఎంట్రీ ఇచ్చిన ఒక్క నెలలోనే ఎమ్మెల్యే అయిపోయింది

పాట్నా: ప్రముఖ ఫోక్​సింగర్ మైథిలి ఠాకూర్(25) బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు క్రియేట్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 14న బీజేపీలో చేరిన ఆమె.. అలీనగర్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరుఫున బరిలోకి దిగారు. ఆర్జేడీ అభ్యర్థి బినోద్ మిశ్రాపై 11,730 ఓట్ల తేడాతో గెలిచి, అసెంబ్లీ చరిత్రలో అతి పిన్న వయసు గల ఎమ్మెల్యేగా ఘనత సాధించారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నెల రోజుల్లోనే ఎమ్మెల్యేగా ఎన్నికై సంచలనం సృష్టించారు. మైథిలీ 2000 జులై 25న మధుబనిలోని బేనిపట్టిలో జన్మించింది. తండ్రి రమేశ్ ప్రోత్సాహంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న ఆమె.. తన  పాటలతో సోషల్‌ మీడియాలో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.