కళ్ల అలసట తగ్గడానికి కొన్ని ట్రిప్స్

కళ్ల అలసట తగ్గడానికి కొన్ని ట్రిప్స్

ఎక్కువ సేపు బ్లూ లైట్ పడితే  కళ్లు తొందరగా అలసిపోతాయి. కళ్ల అలసట తగ్గేందుకు  యోగా ట్రైనర్ నిధి చెప్తున్న టిప్స్​ కొన్ని... 

కనుగుడ్లని అటుఇటు కదిలిస్తే కొంచెం రిలీఫ్​గా ఉంటుంది. అందుకని వాటిని కుడివైపు, ఎడమవైపు పదిసార్లు, అలాగే పైకి, కిందకి పదిసార్లు తిప్పాలి.
కళ్లు అలసిపోయినట్టు అనిపిస్తే చేతివేళ్లతో కళ్లని నెమ్మదిగా ఒత్తిపట్టాలి. దాంతో కంట్లోని కండరాల మీద ఒత్తిడి తగ్గి రిలాక్స్​ అవుతారు.  

కనురెప్పల్ని మూసి, తెరవడం వల్ల కండ్లలోని నీరు, మ్యూకస్​ వంటివి కన్ను అంతా పరుచుకుంటాయి. దాంతో, కండ్ల అలసట మాయం అవుతుంది. అందుకని పదిసార్లు కనురెప్పల్ని వెంటవెంటనే మూసి తెరవాలి.

ఏదైనా ఒక వస్తువు వైపు  కన్నార్పకుండా చూసినా కూడా కండ్ల అలసట తగ్గుతుంది. అందుకని  క్యాండిల్ వెలుతురుని లేదా సూర్యాస్తమయాన్ని చూడాలి. దాంతో కంటి కండరాలు బలంగా మారతాయి. అంతేకాదు కంటిచూపు కూడా మెరుగుపడుతుంది.